29, ఏప్రిల్ 2009, బుధవారం

ఫారెస్ట్ లాన్ -1


అమెరికా లో అన్ని చోట్లా స్మశానాలు ఇలానే ఉంటాయో లేదో తెలీదు కానీ, మా బఫ్ఫలో స్మశానం మటుకు ఒక monument పార్క్ లా ఉంటుంది.

నాకు దెయ్యాలంటే ఎంతో భయం కానండీ, అందరూ ఈ ఫారెస్ట్ లాన్ (Forest Lawn cemetery) కి చాలా చరిత్ర ఉందంటేనూ, చూడ్డానికి ధైర్యం కూడదీసుకుని మరీ వెళ్లాను!

నిజంగానే, అదో అందమైన పార్క్ లా ఉంది, జనాలు వాకింగులూ, జాగింగులూ చేసుకుంటూ పోతున్నారు, పీనుగుల మధ్య ఉన్నామనే ధ్యాస కూడా లేకుండా. సడన్ గా డౌటు !...వీళ్ళు నిజంగా మనుషులేనా అని! దెయ్యాలు మరీ కుక్కలని వాకింగుకి తీసుకు రావు లెమ్మని సర్దిచెప్పుకున్నా!

స్మశాన సౌందర్యాన్ని ఇనుమడించడానికి కాబోలు, మధ్యలో ఒక చిన్న కొలను, దాన్లో బాతులూ, చుట్టూ చెట్లూ.
ఈ స్మశానం లో సమాధికి స్థలం రేటులు చుక్కల్లో ఉంటాయంట. ఒకప్పటి తరం వాళ్లు , వాళ్ల కుటుంబాలకి టోకున స్థలం కొనిపెట్టేసుకున్నారంట! ఆ కొలను , బాతుల ఫోటోలో వేరేగా పోస్టుతా లెండి. మధ్యలో కొన్ని కొన్ని విగ్రహాలు చూసినప్పుడు వెన్ను లోంచి చలి !
ఈ పక్కన ఉన్నా ఫోటో లో కొలను మధ్య ఒక చిన్న బాబు విగ్రహం!.....ఫోటో తీస్తున్నపుడు సడన్ గా పక్కకి కదిలినట్టనిపించింది !!......అంతే ఒక్క సారి నా గుండె జారి పొట్టలోకెళ్ళింది. చుట్టూతా చూసాను...దగ్గర్లో ఎవరూ లేరు...కెమెరా బాగ్ లో చెక్కేసి, అక్కడినించి పరుగు!....ఎందుకో...ఇప్పటికీ ఈ ఫోటో చూస్తుంటే ఒకలాటి భయం-జాలి...పాపం.. ఎవరి బాబో!

ఇంకో చోట మళ్ళీ నా గుండెకాయ అదే ఫీటు చేసింది ....ఈ కింద ఫోటో లోఉన్న సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు , ఆ చుట్టూ ఉన్న తెల్లని విగ్రహాల ముఖాల్లో ఎంతో వేదన....అంతే, వెనక్కి తిరక్కుండా అక్కణ్ణించి వచ్చేసా!

కొన్ని సమాధులుని ..చూసినప్పుడు, వాళ్ల ఆసక్తులు, లేక వృత్తులు తెలుసుకోవచ్చు....


any guesses? "పైన" ఉన్నవారిలో ఒకరికి టెన్నిస్ అంటే ఇష్టం లా ఉంది, ఏకంగా బంతినే పెట్టుకున్నారు, ఇటు ఫై వారికి ఈజిప్టు సంస్కృతి అంటే మక్కువ లా ఉంది. ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ సమాధులు చాలానే ఉన్నాయి ఇక్కడ. నేను cemetery కి వెళ్లాను చూద్దామని అని చెప్పగానే ..."అది తప్ప ఏమీ చూడ్డానికి దొరకలేదా తల్లీ నీకు?" .....ఇదీ! మా ఫ్రెండ్స్ అందరి మొదటి రియాక్షన్. అనుకుంటాం కానీ, తాజ్ మహల్ మాత్రం సమాధి కాదా? పిరమిడ్స్ అవేగా ....అంతెందుకు మన కుతుబ్ షాహి tombs కూడా టూరిస్ట్ స్పాట్ కాదూ?

ఏదేమైనా ....."పొయినోళ్ళందరూ మంచివారు, ఉన్నవాళ్ళు పొయినోళ్ళ తీపి గురుతులు" అని ఓ సినీ కవి అన్నట్టు గుర్తు!చనిపోయిన వారి జ్ఞాపకాలనే కాదు, .....జ్ఞాపకార్ధాలను కూడా గుర్తు పెట్టుకోవాలనే కాబోలు వాళ్ళకి అంత అందమైన కట్టడాలు కట్టించారు. అంత అద్భుతంగా అందరూ కట్టించలేరు కాబట్టి,ఈ కాలం లో కొంత మంది హాస్పిటల్స్ అని, కళ్యాణ మండపాలని, ఫౌండేషన్ అని, బస్ షెల్టర్ అనో ..... వాళ్ల కిష్టమైన వాళ్ల తదనంతరం వారి పేరు మీద సోషల్ సర్వీసు చేస్తున్నారు. రెండో రకం బెటర్ అని నా అభిప్రాయం.
ఈ ఫారెస్ట్ లాన్ నిజంగా, పేరుకి suitable గానే ఉంది ...ఎన్నో వందల ఏళ్ళ నాటి చెట్లు, పచ్చ్చని తివాచీ పరిచినట్టు గడ్డి ....మధ్యలో వున్న కొలను .....very scenic and little creepy at the same time!

వచ్చే పోస్ట్ లో ఇంకొన్ని విశేషాలు ఫారెస్ట్ లాన్ గురించి....మర్చిపోకుండా చూడండి!

1 కామెంట్‌:

  1. modataga niku telugulo chana praveenyam undi.blog chana bagundi.uttaralu vestu undandi.,blog ,blog lo unde, smashanam,smashanamlo chinna abbai bomma,andammaina baatulu,mariyu ninnu bayapettinchina jadala chettu,chana bagunnai. neevu prathibavanthuralivani telusu kani intha pravinyuralivi ani inko konam telisindi.inka koncham chadevedi undi ,adi kuda chadivi malli uttaram vesta.

    రిప్లయితొలగించండి

Related Posts Widget for Blogs by LinkWithin
Powered By Blogger