25, జూన్ 2009, గురువారం

చాలా రోజుల తరువాత .....

మళ్ళీ నా బ్లాగాయణం మొదలుపెట్టాను. ఇప్పటివరకు పరీక్షలనీ, పనులనీ ....కాస్త వత్తిడీ ...బోల్డంత బద్ధకం. కారణాలు ఏవైతేనేం నా బ్లాగుకి comma పెట్టాను.

ఇక రెండో అంకం మొదలు పెట్టేముందు గడిచిన ఆరు నెలల్లో నా స్మృతులని, తీసిన ఫోటోలనీ మీతో పంచుకుందామని.....
జూన్ లో ఇక్కడికి గంటన్నర దూరం లో ఉన్న ఒక చిన్న ఊరికి వెళ్ళేదాన్ని రూరల్ మెడిసిన్ పోస్టింగ్ కోసం. దారిపోడుగూతా చేలు, ద్రాక్ష తోటలూ, ఘాట్ రోడ్ ప్రయాణం, ఇండియన్ రిజర్వేషన్ ఏరియా మీదుగా ,....మధ్యలో కనిపించే జింకలూ, కుందేళ్ళూ, .... భలే హాయిగా ఉండేది ప్రయాణం. ఇక ఆ ఊరిలో ఇళ్లు చిన్నగా అందంగా చుట్టూ పెద్ద పెరట్లతో, రకరకాల పూల మొక్కలతో భలే ఉండేవి. మా హాస్పిటల్ పక్కనే ఉన్న ఇంటావిడ, రొజూ వాళ్ళ గార్డెన్ లో పనిచేసుకుంటూ కనిపించేది ...అబ్బ ఎంత ముద్దుగా ఉంచుకునేదో ఆవిడ గార్డెన్ ఇదిగో కింద చూస్తున్నారుగా.

ఇక వసంతం ఛాయలు పోలేదు....అప్పటికీ.... కింద చూస్తున్నారుగా చెట్లే పూలగుత్తుల్లాగా ఎంత బావున్నాయో.... .

నేనసలు ఇక్కడి చలి కాలం భరించగలుగుతున్నానంటే దానికి కారణం ఈ అందమైన దృశ్యాల గురించి ఎదురుచూపులే. పొద్దున్నే గదిలోకి వచ్చి తట్టి లేపే నులివెచ్చని రవికిరణాలు, కొత్త చిగుళ్ళు, ఇలాటి పూల(గుత్తుల) మొక్కలు...వీటన్నిటికోసం ఎదురు చూపులన్నమాట.

ఎంత ఆహ్లాదంగా ఉండేదో వాటిని చూస్తూ ఉంటె... చుర్రుమనిపించే ఎండ అసలు లెక్కలోకి వచ్చేదే కాదు వీటన్నిటి ముందు.

ఎంత బఫ్ఫెలో అయినా సరే, చలి ఎంత విపరీతమో, ఎండా అంతే విపరీతంగా అనిపించేది. మా హాస్పిటల్ దగ్గర వీధి పేరు...


ఇక చల్లని నా గూట్లో వేసవి అరేంజ్మెంట్స్ చూద్దురుగాని.... నాకు ఇష్టమైన తాటి ముంజెలనీ, పొద్దుతిరుగుడు పూలనీ, రంగు రంగుల పిట్టలనీ గుర్తుకు తెచ్చుకుంటూ... .చిన్నప్పుడు భలే ఆశ్చర్యంగా వుండేది....సూర్యుడి తో పాటు తిరిగే sunflowers అంటే, మా చేలో అపుడపుడు వేసేవారు ఈ పంట. వాటి కళే వేరులే.

















నాకు ఎక్కడ లేని ఇంటరెస్టు పుట్టుకొచ్చేది ఫుడ్ అంటే వేసవి కాలంలో.....ఈ బఫ్ఫెలో చలి కాలం గట్టెక్కాక , కొత్త ఉత్సాహం, కొత్త ఆసక్తులు పెరిగిపోయేవి నాకు...అదేదో డిప్రెషన్ లో నించి బయటపడినట్టు. ఇల్లంతా చక్కగా అలంకరించుకేదాన్ని, బోల్డు రకాల వంటలు చేసుకునేదాన్ని, ....ఇంకా చాలా కొత్త అభిరుచులు ఏర్పరుచుకునేదాన్ని....

తిండి కూడా అదేంటో ఏంటో చాల ఎంజాయ్ చేస్తూ తినేదాన్ని....బాబోయ్, సీజన్ తో మూడ్ కూడా ఇంత మారుతుందా...
మామిడి పళ్ళు లేందే వేసవి ఉంటుందా....అమెరికా అయినా....ఇండియా అయినా....అవి మాత్రం ఉండాల్సిందే ఇంట్లో ఎప్పుడూ స్టాకు.

మర్చిపోయాను,...చిన్నపుడు ఎపుడూ బీచ్ గురించి పెద్దగా ఆసక్తి లేదు కాని...(హైదరాబాద్ లోనే ఉండటం పుణ్యమా అని), పెద్దయ్యాక వైజాగ్ బీచ్ కి వెళ్ళినప్పుడు మాత్రం ఆడుకోటానికి ఓ బీచ్ ఉంటె ఎంత బాగుంటుందో అనిపించేది. బఫ్ఫెలో పక్కన సముద్రం లేకపోయినా... చిన్న సైజు సముద్రాల్లాంటి లాంటి లేక్ ఈరీ ఇంకా లేక్ ఒంటారియో దగ్గరే ఉన్నాయి. ఫ్రెండ్స్ తో లేక్ ఒంటారియో బీచ్ కి వెళ్ళినపుడు ఫోటో ఇదిగోచ్.
ఇదీ నా వేసవి హంగామా... ఇంతేనా.. అప్పుడే ఎక్కడ అయ్యింది...ఇదంతా జూన్ వరకే నండీ ....తరువాత సంగతులు నెక్స్ట్ పోస్ట్ లో.

6, జూన్ 2009, శనివారం

గోడ మీద బొమ్మా!

నే రోజూ వెళ్ళే దారిలో బోల్డు సిత్రాలు! తిన్నగా కారు నడపకుండా నేను అటో కన్ను ఇటో కన్ను వేసి రోడ్డుపక్క కనిపించే బొమ్మలన్నీచూసుకుంటూ వెళ్తుంటా. మరలా చేస్తే డేంజర్ కదా, ఆక్సిడెంట్లు అవ్వవూ అనే మా అమ్మ తెగ టెన్షన్ పడిపోతుంటుంది. అది పక్కన పెడితే, అవన్నీ మీకు చూపించేయ్యలాని నా ఆత్రం.


ఈ రెండు ఫోటోలు మా హాస్పిటల్ కి వెళ్ళే దారిలో డౌన్ టౌన్ లో తీసినవి.



ఎడమన వున్న ఫోటోలో కారు సగం బయటికి వేలాట్టం జనాల్ని ఆ షాపు వంక ఆకర్షించటానికి, ఐడియా బానే ఉంది మరి! కుడి పక్కన గోడ మీద నయాగరా ఫాల్స్.

అబ్బో,.. ఈ షాప్ వాళ్ళకి సిగరెట్ తాగుతున్న సింహం ఐడియా ఎలా వచ్చీసిందో!!

ఎంత బుఫ్ఫెలో లో వుంటే మాత్రం ఇలా గోడలమీద కూడా
ఎక్కించేసారెవరో.

సింహ రాజం ఠీవీగా కొలువయ్యింది ఈ పాతకాలం మూడంతస్తుల భవనం మీద.
ఇటు పక్క , గోడ పై చేపల వేట !
Related Posts Widget for Blogs by LinkWithin
Powered By Blogger