30, మే 2009, శనివారం

ప్రకృతి ఒడిలో - లెచ్చ్వర్త్ పార్క్

ఎటు చూసినా బిల్డింగ్స్, రోడ్లు....పరుగుల ప్రయాణం లో కారు ఎక్కడం దిగటం.......వీటినించి దూరంగా కాస్త సహజ వాతావరణం లో రిలాక్స్ అవ్వాలని ఉబలాటం! అందుకే ఫ్రెండ్స్ అందరం ఇక్కడికి గంట దూరం లో ఉన్నా Letchworth నేషనల్ పార్క్ కి బయలుదేరాం. అక్కడ చెట్ల మధ్యన భోజనం, అంచెలంచెలు గా మూడు వాటర్ ఫాల్స్, కొండని తొలుచుకుంటూ ప్రవాహం.....దాని పక్కన మా నడక.....పలుచని ఎండా....ఎంత హాయిగా అనిపించిందో!
ఏసీల్లో కూర్చుని మగ్గిన గాలినే మళ్ళీ పీల్చి, air freshners తో తడిసిన గాలి కి అలవాటైన నా ముక్కు పుటాలకి నీటి చెమ్మ తో తడిసి,....గడ్డి పూల వాసన, అడవి చెట్ల కమ్మదనం మోసుకొచ్చే గాలి కొత్త గా వుండింది.





ఆ నీటి పాయ అంతోటి కొండని కింద వరకు తొలుచుకుంటూ వెళ్ళటానికి ఎంత కాలం పట్టిందో. అక్కడున్న మూడు జలపాతాలలో అప్పర్ ఫాల్స్
అన్నిటికన్నా బావుంది.
రాళ్ళ మీదుగా దిగి, నది అంచున నడుచుకుంటూ ఫాల్స్ దాకా వెళ్ళాము. అంతా పలకల పలకల రాయి, నీటి ఒరవడికి కొండ ఎలా కరిగిపోయిందో అది చూసాక అర్థమయ్యింది.

కొత్తగా మొలిచిన గడ్డి పూలు ఎంత అందంగా వున్నాయో, ...... ఎండిపోయి రాలిన pine cone కూడా అంత అందంగానే అనిపించింది.
మొత్తానికి Nature's cradle లో కాసేపు అలా వూయలూగి, పర్యావరణ-పర్యాటక శాఖ నించి రోడ్లు భవనాల శాఖకి బదిలీ అయిపోయాము.

14, మే 2009, గురువారం

బిజీ ,...బిజీ...

లైఫ్ సడన్ గా బిజీ అయిపోయింది! పరుగు.....పనులన్నీ చక్క బెట్టుకోడానికి....ఇంకా తెమలని పనులు బోల్డు!
హాస్పిటల్- ఇల్లు-చదువు! వచ్చే august నించి కొత్త responsibilities....అమ్మో....చెయ్యగలనా?? Life never gets simpler కదా! హుం ! ......ఇంకా ఎక్కువ కష్ట పడాలి.......వత్తిడి .....స్పీడు పెంచా ......కానీ, ఏదో మిస్ అవుతున్నట్టు ఉంది.....ఏవీ, నా చిన్న చిన్న ఇష్టాలు??
ఒక్క సారి, నెమ్మదించి......చుట్టూ చూసాను......అర్థం లేకుండా పరిగెడుతున్నట్టు అనిపించింది. ఏదో లోపం.....కొత్త check list కావాలి ......మళ్ళీ priorities reset చేసుకున్నా......నా ప్రయాణం ఫై మళ్ళీ స్పష్టత వచ్చింది.....కొత్త ఉత్సాహం......మళ్ళీ పరుగు మొదలు......

ఈ హడావిడి లో నా బ్లాగ్ ని పట్టించుకోడానికి అస్సలు టైం చిక్కటం లేదు.....చూసారుగా,....ఏప్రిల్ లో 13 పోస్ట్ లు , మే మొదలయ్యి సగం అయినా ...ఒకటే పోస్ట్ !

... టైం లేదు , తీరిక లేదు అనుకుంటుంటాను కానీ, రెండు నిమిషాలు ఆగి, పరికించి చూస్తే అర్థం అవుతుంది, లైఫ్ లో మనం మిస్ అవుతున్న చిన్న చిన్న ఆనందాలు....అశ్రద్ధ తో మిస్ అయ్యే అవకాశాలు ...... ఎన్ని ఉంటాయో.....you just have to slow down once in a while to cherish the journey and get charged again!
మళ్ళీ కలుస్తా.....ఈ సారి తొందర్లోనే!


13, మే 2009, బుధవారం

ఫారెస్ట్ లాన్ - 2

ఫారెస్ట్ లాన్ లో అందంగా, వింతగా కట్టించిన సమాధి monuments ఒక ఎత్తైతే , పూల మొక్కలు, బాతులు, చెట్లూ , కొలను ఇంకో ఎత్తు. ఇక్కడ వందేళ్లు పైబడ్డ చెట్లు చాలానే ఉన్నాయి. సమాధుల మధ్యలో చక చక నడిచేసే బాతులు భలే వెరైటీ గా ఉంటాయి.
పక్కన ఉన్నపూల చెట్టు, నింగి నించి పూలు జారుతున్నట్టు ఉంటే , వెనక ఉన్న ఎండిన చెట్టు ఆకాశానికి వెళ్తున్నట్టు ఉంది-- life and death cycle కి symbolic గా !

నాలో ఎన్నో ఆలోచనలు......మనం ఏమైపోతాం చనిపోయాక?.....నిజంగా మళ్ళీ పునర్జన్మ ఉంటుందా? వుంటే, మరి ఈ
లైఫ్ లో చేసిన చెడ్డ పనులకి వచ్చే లైఫ్ లో అనుభవిస్తామా కష్టాలు? అలా ఎందుకు జరగాలి.....ఈ లైఫ్ లో చేసిన నేరాలకి ఇంకో లైఫ్ లో శిక్షిస్తే, మరి తప్పు చేయకూడదని ఎలా తెలుస్తుంది?

హుం! అయినా మనకి న్యాయం అనిపించేది ఇంకొకరి దృష్టిలో కాకపోవచ్చు....కొన్ని పరిస్థితులలో తప్పక మంచి వాళ్లు కూడా తప్పు చేయవచ్చు....మరి ఎవరుఎలా బేరీజు వేస్తారు ...తప్పొప్పులని?
"ధర్మం చాలా సూక్ష్మమయినది" అంటూ గణపతి సచ్చిదానంద స్వామీ చెప్పిన కథ ....చిన్నప్పుడు మా అమ్మ మాకు వినిపిస్తే ఆసక్తిగా వినేవాళ్ళం. ఇంకో సందర్భంలో చెబుతాను ఆ కథ .
మళ్ళీ నా లోకం లోకి వచ్చాను.....చూస్తే, అలా నడుచుకుంటూ మధ్యలో వున్న pond దగ్గరికి వచ్చాను. నీరు నల్లగా ఉంది, నీటిలో పరిసరాలు reflect అవుతున్నాయి, అందుకే దానీ mirror lake అని పేరు పెట్టినట్టున్నారు. గట్టున ఉన్న నా "దెయ్యం చెట్టు" దగ్గర గా వెళ్లాను.....
ఓ పక్కన బాతులు , తెల్లగా, ముద్దుగా ఉన్నాయి...నీళ్ళలో పువ్వుల్లాగా! .....
కొలను చుట్ట్టూ ఉన్న చెట్ల నిండా మొత్తం తెల్లని పూతే ఉంది, ఆకులు లేకుండా. దేనికి చిహ్నం అంటారు? - స్మశాన వైరాగ్యం కా?.....ఆత్మ శాంతి కా?.....
<---పల్చటి ఎండలో క్యూట్ వైట్ అండ్ ఎల్లో పూలు.
తీరిక గా నించున్న బాతులు ---->



Angels in heaven....అక్కడక్కడా...గుంపుల్లో బాతులు కనువిందు చేస్తాయి....మనం దగ్గరికి రాగానే, ఏమైనా ఆహారం వేస్తమేమో అని చుట్టూ మూగుతాయి. కింద చెట్టు కూడా వంగిన బాతులా ఉంది కదూ.


నువ్వటు...నేనిటు....ఎద మొహం-పెడ మొహం!
కొలను మధ్యన ఫౌంటైన్ ....జలకాలాట లలో .....గల గల పాటల తో ...ఏమి హాయిలే హలా!
so,...స్మశానం కూడా అందం గా చూడముచ్చట గా వుండొచ్చు అనమాట. రోజూ అక్కడ జాగింగ్ కి వచ్చే వాళ్ళకి.... లైఫ్ ని ఉన్నంత లో ఎంజాయ్ చెయ్యాలని గుర్తు చేస్తుంటుందేమో ఈ ఫారెస్ట్ లాన్!
Related Posts Widget for Blogs by LinkWithin
Powered By Blogger