29, ఏప్రిల్ 2009, బుధవారం

ఫారెస్ట్ లాన్ -1


అమెరికా లో అన్ని చోట్లా స్మశానాలు ఇలానే ఉంటాయో లేదో తెలీదు కానీ, మా బఫ్ఫలో స్మశానం మటుకు ఒక monument పార్క్ లా ఉంటుంది.

నాకు దెయ్యాలంటే ఎంతో భయం కానండీ, అందరూ ఈ ఫారెస్ట్ లాన్ (Forest Lawn cemetery) కి చాలా చరిత్ర ఉందంటేనూ, చూడ్డానికి ధైర్యం కూడదీసుకుని మరీ వెళ్లాను!

నిజంగానే, అదో అందమైన పార్క్ లా ఉంది, జనాలు వాకింగులూ, జాగింగులూ చేసుకుంటూ పోతున్నారు, పీనుగుల మధ్య ఉన్నామనే ధ్యాస కూడా లేకుండా. సడన్ గా డౌటు !...వీళ్ళు నిజంగా మనుషులేనా అని! దెయ్యాలు మరీ కుక్కలని వాకింగుకి తీసుకు రావు లెమ్మని సర్దిచెప్పుకున్నా!

స్మశాన సౌందర్యాన్ని ఇనుమడించడానికి కాబోలు, మధ్యలో ఒక చిన్న కొలను, దాన్లో బాతులూ, చుట్టూ చెట్లూ.
ఈ స్మశానం లో సమాధికి స్థలం రేటులు చుక్కల్లో ఉంటాయంట. ఒకప్పటి తరం వాళ్లు , వాళ్ల కుటుంబాలకి టోకున స్థలం కొనిపెట్టేసుకున్నారంట! ఆ కొలను , బాతుల ఫోటోలో వేరేగా పోస్టుతా లెండి. మధ్యలో కొన్ని కొన్ని విగ్రహాలు చూసినప్పుడు వెన్ను లోంచి చలి !
ఈ పక్కన ఉన్నా ఫోటో లో కొలను మధ్య ఒక చిన్న బాబు విగ్రహం!.....ఫోటో తీస్తున్నపుడు సడన్ గా పక్కకి కదిలినట్టనిపించింది !!......అంతే ఒక్క సారి నా గుండె జారి పొట్టలోకెళ్ళింది. చుట్టూతా చూసాను...దగ్గర్లో ఎవరూ లేరు...కెమెరా బాగ్ లో చెక్కేసి, అక్కడినించి పరుగు!....ఎందుకో...ఇప్పటికీ ఈ ఫోటో చూస్తుంటే ఒకలాటి భయం-జాలి...పాపం.. ఎవరి బాబో!

ఇంకో చోట మళ్ళీ నా గుండెకాయ అదే ఫీటు చేసింది ....ఈ కింద ఫోటో లోఉన్న సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు , ఆ చుట్టూ ఉన్న తెల్లని విగ్రహాల ముఖాల్లో ఎంతో వేదన....అంతే, వెనక్కి తిరక్కుండా అక్కణ్ణించి వచ్చేసా!

కొన్ని సమాధులుని ..చూసినప్పుడు, వాళ్ల ఆసక్తులు, లేక వృత్తులు తెలుసుకోవచ్చు....


any guesses? "పైన" ఉన్నవారిలో ఒకరికి టెన్నిస్ అంటే ఇష్టం లా ఉంది, ఏకంగా బంతినే పెట్టుకున్నారు, ఇటు ఫై వారికి ఈజిప్టు సంస్కృతి అంటే మక్కువ లా ఉంది. ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ సమాధులు చాలానే ఉన్నాయి ఇక్కడ. నేను cemetery కి వెళ్లాను చూద్దామని అని చెప్పగానే ..."అది తప్ప ఏమీ చూడ్డానికి దొరకలేదా తల్లీ నీకు?" .....ఇదీ! మా ఫ్రెండ్స్ అందరి మొదటి రియాక్షన్. అనుకుంటాం కానీ, తాజ్ మహల్ మాత్రం సమాధి కాదా? పిరమిడ్స్ అవేగా ....అంతెందుకు మన కుతుబ్ షాహి tombs కూడా టూరిస్ట్ స్పాట్ కాదూ?

ఏదేమైనా ....."పొయినోళ్ళందరూ మంచివారు, ఉన్నవాళ్ళు పొయినోళ్ళ తీపి గురుతులు" అని ఓ సినీ కవి అన్నట్టు గుర్తు!చనిపోయిన వారి జ్ఞాపకాలనే కాదు, .....జ్ఞాపకార్ధాలను కూడా గుర్తు పెట్టుకోవాలనే కాబోలు వాళ్ళకి అంత అందమైన కట్టడాలు కట్టించారు. అంత అద్భుతంగా అందరూ కట్టించలేరు కాబట్టి,ఈ కాలం లో కొంత మంది హాస్పిటల్స్ అని, కళ్యాణ మండపాలని, ఫౌండేషన్ అని, బస్ షెల్టర్ అనో ..... వాళ్ల కిష్టమైన వాళ్ల తదనంతరం వారి పేరు మీద సోషల్ సర్వీసు చేస్తున్నారు. రెండో రకం బెటర్ అని నా అభిప్రాయం.
ఈ ఫారెస్ట్ లాన్ నిజంగా, పేరుకి suitable గానే ఉంది ...ఎన్నో వందల ఏళ్ళ నాటి చెట్లు, పచ్చ్చని తివాచీ పరిచినట్టు గడ్డి ....మధ్యలో వున్న కొలను .....very scenic and little creepy at the same time!

వచ్చే పోస్ట్ లో ఇంకొన్ని విశేషాలు ఫారెస్ట్ లాన్ గురించి....మర్చిపోకుండా చూడండి!

25, ఏప్రిల్ 2009, శనివారం

Tea lights తో నా ప్రయోగాలు

"దీపం జ్యోతి పరబ్రహ్మం"... చీకట్లో దీపం వెలిగించగానే, మనసు లో చాలా ప్రశాంతత .....నాకు దీపాలు వెలిగించడం అంటే బోల్డు ఇష్టం. నా దగ్గర అన్ని దీపాలు లేవు మరి!... అందుకే Tea Lights వాడుతుంటాను. ఇవి భలే ముద్దుగా వుంటాయి సుమా.....అవటానికి కాండిల్సే అయినా....బుజ్జిగా, cute గా వుంటాయి. వీటిని రకరకాల base vessel లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా అందంగా ఇమిడిపోతాయి.

చిల్లర గిన్నెలో ....ధన లక్ష్మీ దీపం!

వత్తి ఒక అంచువైపు ఓర గా వచ్చిన టీ లైట్ లో మెక్సికన్ కాయిన్ పెట్టాను. ఆ లైట్ ని కాయిన్ reflect చేస్తూ అదే స్థిరమైన flame లాగా బావుంది కదా! కాయిన్ బదులు అంగుళం సైజు అద్దాన్ని పెట్టొచ్చు ఇంకా ప్రకాశవంతంగా వుండటానికి.


stained glass అండ్ candles. రెండూ మంచి కాంబినేషన్. దాన్ని ఒక అద్దం పైనో లేక కాస్త డార్క్ గ్లాస్ పైనో పెడితే చాలా క్లాస్సిక్ గా వుంటుంది.
అదే టీ లైట్ ని ఎర్రని గాజు పాత్ర లో పెట్టి వేలాడదీస్తే ఎలా వుందో చూడండి...... ఎర్రని కాంతి లో స్థిరంగా వున్న వత్తి ....

అద్దం ముందు దీపం. Multiple images చూడ ముచ్చటగా వుండటమే కాక ఆ వెలుతురు ఇల్లంతా పరుచుకున్నట్టు ఎంతో bright గా అనిపిస్తుంది. ఈ కింద orange కలర్ మండపం లాంటి లాంతరు. తలుపు తీస్తే దీపం ఇంచుమించు
శివలింగాకారం లో కనిపిస్తూ ఉంటే, తలుపు మూసి పైనుంచి చూస్తే పువ్వులాంటి వెలుగు రేఖలు-అందంగా ఉంది కదా ఈ అరేంజ్మెంట్ .




నేనూ- నా దెయ్యం చెట్టు గోల!

ఒక్కొక్కరికి ఒక్కో భయం! నాకు సముద్రం అంటే భయం, పాములంటే హడల్ !
ప్రపంచం లో చాలా మందికి సాలీళ్ళు అంటే వెర్రి భయం అంట. సోషల్ ఫోబియా కూడా చాలా కామన్. నలుగురి లో మాట్లాడాలంటే వీళ్ళకి వణుకే.
ఒక్కో సారి చిన్నపటినించి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన భయాలు కాక, కొత్త భయాలు పుడతాయి మనసులో.
ఇంతకీ అసలు సంగతేంటంటే మొన్నీమధ్య ఇంటికి వస్తోంటే దారిలో ఒక జడలు విరబోసుకున్నట్టు ఉన్న దెయ్యం చెట్టొకటి కనిపించింది.....అప్పటికే కాస్త చీకటి పడింది, ఇదివరకెప్పుడూ ఆ చెట్టునక్కడ చూసినట్టు గుర్తులేదు, అటు వైపుగా పెద్దగా వచ్చింది కూడా లేదనుకోండి! సడన్ గా భయం పుట్టింది నాకు.....కార్ స్పీడ్ పెంచేసి ఆ ఏరియా నుండి బయటపడ్డా. ఇంటికి వచ్చాక కూడా అదే గుర్తుకు వస్తోంది...

నా చిన్నప్పుడు ఊరికి వెళ్తే అక్కడ పిల్లలు చింత చెట్టు కింద దెయ్యాలుంటాయని చెప్పేవారు....వూళ్ళో వీధులన్నీ దర్జాగా తిరిగేసి, చింత చెట్టుకిందకి రాగానీ....మనసులో పీకేది...ఏమో నిజంగానే దెయ్యాలున్నయేమో !!....పరుగే పరుగు అక్కణ్ణించి.

ఇంతకీ దెయ్యం అంటే గుర్తొచ్చింది,....నా మొదటి హార్రర్ సినిమా రాంగోపాల్ వర్మ "రాత్రి". అందులో రేవతి కళ్లు నన్ను ఎన్ని రోజులు నిద్రపోనీలేదో....నాకే తెలుసు....ఒక నెల రోజుల వరకు ఒక్కదాన్నే బాత్రూంకి వెళ్ళాలన్నా భయం!....మంచం కిందకి తొంగి చూడాలన్నా భయం!....పడుకునేటప్పుడు లైట్ ఆర్పేయాలన్నా భయం!

సరే, మళ్ళీ నా చెట్టు గోలకి వద్దాం. ఇలా భయాల లిస్టు పెంచుకుంటూ పోతే లాభం లేదనేసుకుని ..."దాన్ని ఫోటో తీసి నా బ్లాగు లో పెడదాం...రొజూ చూస్తూంటే భయం వడులుతుందని" డిసైడ్ అయిపోయా.


మర్నాడు hospital నించి ఇంటికి వచ్చేటప్పుడు, కాస్త వెలుతురు ఉండగానే బయలుదేరా....మళ్ళీ చీకటి పడితే మనసు మార్చేసుకుంటానేమో అని త్వరగా వెళ్ళి దాన్ని నా కెమేరాలో బంధించేసాను. హమ్మయ్య! ఇక నిశ్చింతగా పడుకోవచ్చు అనుకుంటూ ఇంటికి చేరాను. పార్కింగ్ లో నడుస్తూండగా అందమైన sunset కనిపించింది. కార్ల మధ్యన, ఇంక చిగురురాని చెట్ల మధ్యన....ఆరంజ్, యెల్లో, బ్లూ, పర్పుల్ కాంబినేషన్స్ అదుర్స్!

Have a good night!



24, ఏప్రిల్ 2009, శుక్రవారం

అలసిన వేళ.....!

After a long day! నిన్న పొద్దుటే ఇంట్లోంచి బయలుదేరానా... రాత్రి హాస్పిటల్ లో కాల్ డ్యూటీ! అది ముగించుకుని ఇవాళ పొద్దున్న ఇంటికి చేరటం!
రాగానే చేతిలో ఉన్నహ్యాండ్ బ్యాగు, తాళాలు అన్నీకింద పడేసి, సోఫా లో కూలబడ్డా! కాస్త నీరసం....బోల్డంత బద్దకం! నా చుట్టూ పరుచుకుంటున్న ఎండలో రూమ్ ని ఓసారి అలా...zoom చేయగానే....కళ్లు సోఫా పక్కన ఉన్నవాటి మీద పడ్డాయి. మొన్నీమధ్య ఆర్డర్ చేసిన హార్డ్ డిస్క్....నన్ను ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని అలిగి కూర్చున్నట్లుంది!
దాని పక్కనే ఉన్న ఎర్రని బ్యాగు వారం క్రితం సెమినార్ కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నది ...."ఈ ఇంట్లో నా స్థానం ఏమిటా?...ఉండనిస్తారా బయటపడేస్తారా " అన్నట్టు మూల నక్కింది.
దానవతల ఉన్న ఆరంజ్ బాక్స్ లో jenga - అనే గేమ్! క్రితం ఆదివారం ఫ్రెండ్స్ అందరం letchworth park కి వెళ్ళినప్పుడు, తీసుకెళ్దామని బయటపెట్టి మర్చిపోయి వెళ్ళిన సంగతి గుర్తు చేస్తూ!
నేనూ, నా చుట్టూ వున్న సామానూ .... ఒంటరిగా వున్నప్పుడు ఏమి తోచనప్పుడు వాటి తోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అలా అని నాకు ఏ schizophreniaనో(మానసిక వ్యాధి) అంటకట్టకండి, మీరు మరీను!ఫోటో అయితే తీసా గానీ, కాస్త సర్దుదామంటే, అబ్బే...వేలు కూడా కదలట్లేదు!...లాభం లేదు...ఈ నిసత్తువ లోంచి బయటపడాలంటే ...మాంచి నిద్ర వెయ్యాల్సిందే! మళ్ళీ లేచాక తీరిగ్గా వచ్చి కొత్త పోస్ట్ వేస్తానులే!

22, ఏప్రిల్ 2009, బుధవారం

ఆరోగ్యం - మహాభాగ్యం

బాగున్నారా? కుశలమేనా?.....అని ఎవరైనా అడిగితే....ఆ ...బానే వున్నా! అని తేలిగ్గా అనిపారేస్తాం!

అష్ట లక్ష్ముల్లో ధన లక్ష్మీ, విద్యా లక్ష్మీ, వీరలక్ష్మీ, విజయలక్ష్మీ...చివరికి సంతానలక్ష్మీ ఉన్నా...ఆరోగ్య లక్ష్మి లేకపోడమేంటి చెప్మా! అనిపిస్తూ ఉంటుంది నాకు.

దేవుళ్ళ సంగతి ఎలా ఉన్నా .....ఈ మధ్య అందరికీ కాస్త ఆరోగ్యం గురించి యావ పెరిగింది. అలవాట్లూ నెమ్మదిగా మారుతున్నాయి. సిక్స్ ప్యాక్ , జీరో సైజుల క్రేజ్ పుణ్యం...Fitness గురించి యువత లో కాస్త మోజు పెరిగింది.

ఈ మధ్య బుఫ్ఫెలో లో జరిగిన WellFest లో హాస్పిటల్లూ , క్లినిక్ లూ హైబిపి , డయాబెటిస్, గుండె జబ్బుల గురించి ఊదరగొట్టాయి......వాటన్నిటి మధ్యలో..నన్ను ఆకట్టుకున్నవి మీకు చూపిస్తున్నా..!


పర్యావరణం- ఆరోగ్యం .....మనం ప్రకృతి క్షేమం చూసుకుంటే, ప్రకృతి మనం క్షేమం చూస్తుంది!

      సరదా సరదా సిగరెట్టూ....అనే రేలంగి పాట విన్నారా? ఆ సరదా ఊపిరితిత్తులని ఎలా తయారు చేస్తుందో చూడండి! చక్కగా జున్ను ముక్కలా ఉన్నది కాస్తా....పొగ చూరిన రాయి లాగ, కాన్సర్ తో కుళ్ళిన పండు లాగ ఎలా తయారయ్యిందో..... బోర్డు మీద అతికించినవి నిజంగా మనిషి ఊపిరితిత్తులే !

      స్ట్రోక్ - గురించి చెప్పే మోడల్ . మీ బీపీ , షుగరూ కాస్త కంట్రోల్ లో పెట్టుకోండి!

      సెక్సువల్ హెల్త్ గురించి మాత్రం ఇంకా సరైన అవగాహన చాలా మందికి లేదు , ముఖ్యంగా ఆడవాళ్ళకి.....ఇండియా లోనే కాదు...అమెరికా లోనూ.

      బుజ్జి బుజ్జి డాక్టర్ టెడ్డీ లు ఎంత బావున్నాయో!

      యోగాకి ఇక్కడ బానే క్రేజ్ ఉంది. బిక్రం యోగా అంటే మామూలు యోగాసనాలే చెమటలు పట్టించే ఉష్ణోగ్రత లో చేయిస్తారు.

      ఆక్యుపంక్చర్ - ఎక్కడో గుచ్చితే ఇంకేక్కడూ నయమవుతుందట.....చైనా వాళ్ల వైద్యం. కొన్ని నొప్పులకి బాగా పనిచేస్తుందంటారు!

      మైండ్-బాడీ చికిత్స రేకీ. కొందరికి చాలా నమ్మకం!

      మసాజ్ థెరపీ.....కండరాల నొప్పులకి....నా పేషెంట్స్ కి ఇది మాత్రం తప్పని సరిగా చెప్తాను!

    • ఇవన్నీ ఒక ఎత్తు! మంచి ఆహారం,రొజూ కొంచెం ఒంటికి శ్రమ, మనసుకి నచ్చే పనులు చేయడం ....ఇవి ఒక ఎత్తు .....చెప్పడమే కాదు , నేను కూడా చేయాలని నిర్ణయించుకున్నాను!

    19, ఏప్రిల్ 2009, ఆదివారం

    నడకలు నేర్చిన బుడతల కోసం.....

    YMCA అంటే నాకు గుర్తొచ్చేవి స్విమ్మింగ్- ఆటలు-మ్యూజిక్ -పెయింటింగ్. చిన్నపుడు నా ఫ్రెండ్స్ అక్కడ అవన్నీ నేర్చుకోవచ్చు అని చెప్తూంటే నాకు కూడా వెళ్ళాలనిపించేది. ఇంకా ఎన్నో మంచి activities అక్కడ ఉండేవి, వేసవి లో ముఖ్యంగా. . ఇప్పుడు స్కూల్లోనే చదువు తో పాటు వేరే విద్యలని కూడా నేర్పుతున్నారనుకుంటా.
    కొత్తగా YMCA లో pre- school పిల్లల కోసం కూడా activities మొదలు పెట్టారు. వాటిలో కొన్నిటిని చూడండిక్కడ...
    రంగులతో ఆటలు....


    కలర్ ఫుల్ కార్పెట్ పైన అక్షరాలు, అంకెలు....వాటి పైన నడుస్తూ నేర్చుకోవచ్చు ఎంచక్కా !

    క్యూట్ గా ఉన్నాయి కదూ....క్లిఫ్ఫోర్డ్ డాగ్ లు.

    పూసలతో కూడికలూ...తీసివేతలు.

    సొంతం గా తినడం అలవాటు అవ్వాలిగా మరి!

    ఇదో కొత్త రంగుల గేమ్ లా ఉందే !!

    బాస్కెట్ బాల్ మొట్టమొదటగా YMCA లోనే ఆట గా మొదలుపెట్టారు . 1891 మాట ఇది!-చలికాలం లో ఆడుకునే indoor క్రీడగా డిజైన్ చేసారు.


    స్టాట్లర్ హోటల్

    Statler hotel- ఒకప్పటి ప్రసిద్ధ హోటల్. బఫ్ఫెలో గత వైభవానికి గుర్తుగా మిగిలిపోయింది.1923 లో కట్టిన ఈ హోటల్ అప్పట్లో Western New York లో కల్లా ఎతైన భవనం. 19 అంతస్తులు, 1100 గదులు- renaissance revival style లో కట్టారు. 60 లలో మూత పడ్డ ఈ అందమైన హోటల్ ని ప్రస్తుతం కొంత భాగం కార్యాలయం గా వాడుతున్నారు. మొన్నీమధ్య ఇక్కడ జరిగిన Buffalo wellfestకి వెళ్ళినప్పుడు తీసిన ఫొటోలు .....
    మెయిన్ హాలు

    బాల్ రూమ్ పైన రెండో అంతస్తులోని గదులు....వాటి తలుపులకి పెద్ద అద్దాలు.

    పిట్ట గోడలకి ఉన్నా బంగారు రంగు డిజైన్."S" అనే అక్షరం స్టాట్లర్ కి చిహ్నం.

    పాత కాలం లిఫ్టు... ఎంత classy గా ఉంది కదా చూడటానికి! విచిత్రం ఏంటంటే కుడి వైపున ఉన్నా లిఫ్ట్ పైకి వెళ్తుంది, ఎడమ ఉన్నది కిందకి వెళ్తుంది. రెండిటి మధ్యలో ఉన్నది ఇత్తడి తో చేసిన post బాక్స్- ఇప్పటికీ వాడుక లో ఉంది.

    ఈ తాతల కాలం గడియారం అప్పట్లో ప్రతి వీధిలో వుండేవంట

    అన్ని గోడలకీ ఎర్రని లైనింగ్ బోర్డర్ బావుంది కదా!....దాన్ని ఆంతీమియాన్ బోర్డర్ అంటారు.

    హోటల్ లో చిన్న థియేటర్ .....ప్రస్తుతం aerobics క్లాసు నడుస్తోందక్కడ.
    ఇంత అందమైన హోటల్ కి మళ్ళీ పునర్వైభవం వస్తే బావుండు.

    15, ఏప్రిల్ 2009, బుధవారం

    మా క్లినిక్ లో ....little corners

    ఇవాళ నా కెమెరా కంటికి చిక్కిన మా క్లినిక్ లోని చిన్న చిన్న కోణాలు....

    మా రిసెప్షనిస్టు డెస్క్ పైన బారులు తీరిన మగ్గులు.

    మెదడు, గుండె, కిడ్నీ, కన్ను... డయాబెటిస్ (అదే.. మధుమేహం) వున్నా, బీపి ఎక్కువైనా వీటికి ఏమవుతుందో పేషెంట్ కి చూపెట్టడానికి.....

    ఈ ఇంటర్నెట్ యుగం లో పుస్తకాలు షో కోసమే అన్నట్టుంది....

    రకరకాల టెస్టుల కోసం నమూనలని ఎలా సేకరించాలో మర్చోపోకుండా గుర్తు చేసేందుకు....

    మూల నక్కిన sample మందులూ, ఆక్సిజన్ ట్యాంక్ లూ!
    Related Posts Widget for Blogs by LinkWithin
    Powered By Blogger