10, ఏప్రిల్ 2009, శుక్రవారం

వసంతం- వేసవి




నేనుండేది Buffalo, న్యూ యార్క్ . ఐదారు నెలల నించి ఎదురు చూస్తున్నా ఎండా కాలం కోసం.
ఊరిస్తూ ఊరిస్తూ వచ్చేసింది ...వేసవి! spring అనాలేమో!
చైత్ర మాసం -మనం వసంతం అంటాం....
కాకపోతే మనకి ఆరు రుతువులు ఉన్నా....ఎండా కాలం, వర్షాకాలం , ఇంకా చలికాలం...ఇవే ఎక్కువ వాడుక.
లేలేత చిగుళ్ళు, పచ్చబడుతున్న గడ్డి, నులివెచ్చని సూర్యోదయాలు, హాయిగా అనిపించే వాతావరణం....
అన్ని seasons లో కల్లా నాకిష్టమైనది వసంతమే . నచ్చే నెల- ఏప్రిల్.
ఆంధ్ర లో ఏప్రిల్ అంటే నాకు గుర్తోచేవి- ఉగాది పచ్చ్చడి, మామిడి కాయలు, సీతాకల్యాణం, కొత్త పూత, మల్లె పూలు, కాటన్ బట్టలు.
అక్కడ ఎండలు మండినా, ఉక్కపోసినా, అలవాటు వల్ల కాబోలు... బానే ఉండేది.
మర్చిపోయా.... వేసవి ఇంకొందుకు special - ice creams. ఇంకా నా చిన్నప్పుడు రస్నా తెగ ఫేమస్!
ఏప్రిల్ ఇంకొందుకు కుడా ఇష్టం...ఎగ్జామ్స్ అయిపోయి holidays మొదలయ్యేవి. అబ్బ ఎన్ని ఎదురు చూపులో వాటి కోసం! హా.!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Widget for Blogs by LinkWithin
Powered By Blogger