22, ఏప్రిల్ 2009, బుధవారం

ఆరోగ్యం - మహాభాగ్యం

బాగున్నారా? కుశలమేనా?.....అని ఎవరైనా అడిగితే....ఆ ...బానే వున్నా! అని తేలిగ్గా అనిపారేస్తాం!

అష్ట లక్ష్ముల్లో ధన లక్ష్మీ, విద్యా లక్ష్మీ, వీరలక్ష్మీ, విజయలక్ష్మీ...చివరికి సంతానలక్ష్మీ ఉన్నా...ఆరోగ్య లక్ష్మి లేకపోడమేంటి చెప్మా! అనిపిస్తూ ఉంటుంది నాకు.

దేవుళ్ళ సంగతి ఎలా ఉన్నా .....ఈ మధ్య అందరికీ కాస్త ఆరోగ్యం గురించి యావ పెరిగింది. అలవాట్లూ నెమ్మదిగా మారుతున్నాయి. సిక్స్ ప్యాక్ , జీరో సైజుల క్రేజ్ పుణ్యం...Fitness గురించి యువత లో కాస్త మోజు పెరిగింది.

ఈ మధ్య బుఫ్ఫెలో లో జరిగిన WellFest లో హాస్పిటల్లూ , క్లినిక్ లూ హైబిపి , డయాబెటిస్, గుండె జబ్బుల గురించి ఊదరగొట్టాయి......వాటన్నిటి మధ్యలో..నన్ను ఆకట్టుకున్నవి మీకు చూపిస్తున్నా..!


పర్యావరణం- ఆరోగ్యం .....మనం ప్రకృతి క్షేమం చూసుకుంటే, ప్రకృతి మనం క్షేమం చూస్తుంది!

      సరదా సరదా సిగరెట్టూ....అనే రేలంగి పాట విన్నారా? ఆ సరదా ఊపిరితిత్తులని ఎలా తయారు చేస్తుందో చూడండి! చక్కగా జున్ను ముక్కలా ఉన్నది కాస్తా....పొగ చూరిన రాయి లాగ, కాన్సర్ తో కుళ్ళిన పండు లాగ ఎలా తయారయ్యిందో..... బోర్డు మీద అతికించినవి నిజంగా మనిషి ఊపిరితిత్తులే !

      స్ట్రోక్ - గురించి చెప్పే మోడల్ . మీ బీపీ , షుగరూ కాస్త కంట్రోల్ లో పెట్టుకోండి!

      సెక్సువల్ హెల్త్ గురించి మాత్రం ఇంకా సరైన అవగాహన చాలా మందికి లేదు , ముఖ్యంగా ఆడవాళ్ళకి.....ఇండియా లోనే కాదు...అమెరికా లోనూ.

      బుజ్జి బుజ్జి డాక్టర్ టెడ్డీ లు ఎంత బావున్నాయో!

      యోగాకి ఇక్కడ బానే క్రేజ్ ఉంది. బిక్రం యోగా అంటే మామూలు యోగాసనాలే చెమటలు పట్టించే ఉష్ణోగ్రత లో చేయిస్తారు.

      ఆక్యుపంక్చర్ - ఎక్కడో గుచ్చితే ఇంకేక్కడూ నయమవుతుందట.....చైనా వాళ్ల వైద్యం. కొన్ని నొప్పులకి బాగా పనిచేస్తుందంటారు!

      మైండ్-బాడీ చికిత్స రేకీ. కొందరికి చాలా నమ్మకం!

      మసాజ్ థెరపీ.....కండరాల నొప్పులకి....నా పేషెంట్స్ కి ఇది మాత్రం తప్పని సరిగా చెప్తాను!

    • ఇవన్నీ ఒక ఎత్తు! మంచి ఆహారం,రొజూ కొంచెం ఒంటికి శ్రమ, మనసుకి నచ్చే పనులు చేయడం ....ఇవి ఒక ఎత్తు .....చెప్పడమే కాదు , నేను కూడా చేయాలని నిర్ణయించుకున్నాను!

    1 కామెంట్‌:

    1. నేను నా బ్లాగు మొదలెట్టి 21రోజులు అయ్యిందండి.ఇప్పటికి ఒక 50బ్లాగులదాకా చూసి ఉంటాను.కొన్ని గొప్పవి,కొన్ని చెత్తవి,కొన్ని ఆసక్తికరమైనవి,కొన్ని ఫాలో అవ్వాలనిపించినవి..మీది ఆఖరు క్యాటగిరి.సినిమావాళ్ళని డాక్టర్ అవ్వబోయి ఏక్టర్ అయ్యరా?అని అదుగుతారు.మీరు ఇన్కేదో అవ్వబోయి డాక్టర్ అయ్యారా?మీ థాట్స్ అచ్చం నావి లాగే ఉన్నాయి.
      మొత్తానికి మీ బ్లాగ్ నాకు బాగా నచ్చేసిందండి.

      రిప్లయితొలగించండి

    Related Posts Widget for Blogs by LinkWithin
    Powered By Blogger