20, మార్చి 2010, శనివారం

ఛాయాచిత్రాలు - shadows

వెలుగు- నీడలు : అంటే నీవూ నేనూ
సగం వెలుగు సగం నీడ
సగం ఋతం సగం మనృతం
ఈ వెల్తురు ఈ చీకటి
ఈ ఇరులూ ఈ వెలుగూ
వేరు వేరు గదులు కావు
- శ్రీ శ్రీ. ఖడ్గ సృష్టి లోంచి కొన్ని పంక్తులు

వెలుగు తోనే నీడ, రెంటిని వేరు చేయగలమా ?

మగువా? మద్యమా ? వెలుతురు ?చీకటి?


వెలుగు నీడలో మధ్యలో రంగుల ఆటే కదా -జీవితం


వెలుగు రేఖలు నిండిన ఓ వేకువలో చిక్కటి కాఫీ - ఆహా !

20, ఫిబ్రవరి 2010, శనివారం

ఫ్లోరిడా ముచ్చట్లు

పోయిన సెప్టెంబర్ లో ఫ్లోరిడా వెళ్ళాము . అక్కడ డిస్నీ వరల్డ్, యూనివర్సల్ స్టూడియోస్, సీ వరల్డ్ ఇవన్నీ ఒక ఎత్తైతే..., మయామీ, కీ వెస్ట్ ఇవి ఇంకో రకం అనుభవం. ఏదైనా అమెరికా లో ఒక్కసారైనా వెయ్యాల్సిన ట్రిప్ ఫ్లోరిడా. మీరందరూ ఆల్రెడీ వీటన్నిటి ఫోటోలు చూసేవుంటారు....అందుకే అక్కడ తీసిన లో ఫోటోస్ కొన్ని మాత్రం ఇక్కడ పోస్ట్ చేస్తున్నా. ఇందులో సగం మా వారు తీసినవే.

వెలుగు జిలుగులలో డిస్నీ వరల్డ్ కాసిల్ , దాని ముందు మిక్కీ మౌస్ చేయి పట్టుకుని ఉన్న వాల్ట్ డిస్నీ. కింద కూడా బ్లూ లైటింగ్ లో అదే కాసిల్. ఫైర్ వర్క్స్ మాత్రం డిస్నీ వరల్డ్ లోనివే అన్నిటికన్నా బెస్ట్ !!

ఎడమ పక్కన ఉన్నది ఎప్కోట్ పార్క్ లో ఉండే వరల్డ్ అట్రాక్షన్- చైనా పెవీలియోన్ లో హాల్ అందం. కుడి వైపు కిందన ఉన్నది అక్కడి గోడ ఫై ఉన్నా చిప్ వర్క్


యీ కింద ఉన్న ఫోటోలో ఉన్నది డిస్నీ ఎప్కోట్ పార్క్ లో ఉన్న ఫుడ్ లౌంజ్ , భలే ఉంది కదా


అక్కడ థీం పార్కులలో ఉన్న బోల్డన్ని రైడ్స్ లో కింద ఫోటోలోది కుడా ఒకటి - సీ వరల్డ్ లోని బ్లూ రే రైడ్


కొంగ జపం- దొంగ జపం ....., ఒంటి కాలి మీద నించుని తల వాల్చేసి ఎలా ఉన్నాయో చూడండి. సీ వరల్డ్ లోని ముచ్చట ఇది.
శాము rocks!! -సీ వరల్డ్ లోని అట్రాక్షన్ కిల్లర్ వేల్ విన్యాసాలు.


తిరిగి వచ్చే దారిలో కనిపించిన మబ్బుల చాటు సంధ్యా కిరణాలు .

కింద ఫోటోలో మయామి లో ఉన్న ఒక బిల్డింగ్ . విశేషం ఏంటంటే అక్కడ కొబ్బరి చెట్లు, డేట్స్ చెట్లు, ఇంకా మన వైపు కనిపించు రకరకాల పూల చెట్లు చూసి ఎంత మురిసిపోయానో. మరి బుఫ్ఫెలో లో ఉండే నాకు కనకాంబరాలు, మందారాలు, నంది వర్ధనాలు, బోగన్ విల్లాలు కనిపిస్తే మురిసిపోనూ !!


యీ కింద, కీ వెస్ట్ దగ్గర సూర్యాస్తమయం!. అలా ఉండిపోయి చూస్తూనే ఉండాలనిపించింది .


మయామి లోని సౌత్ బీచ్, బీచ్ పక్కన రోడ్ లో ఉండే రెస్టారెంట్స్ లో ఫుడ్ బావుంటుంది.
Related Posts Widget for Blogs by LinkWithin
Powered By Blogger