25, ఏప్రిల్ 2009, శనివారం

నేనూ- నా దెయ్యం చెట్టు గోల!

ఒక్కొక్కరికి ఒక్కో భయం! నాకు సముద్రం అంటే భయం, పాములంటే హడల్ !
ప్రపంచం లో చాలా మందికి సాలీళ్ళు అంటే వెర్రి భయం అంట. సోషల్ ఫోబియా కూడా చాలా కామన్. నలుగురి లో మాట్లాడాలంటే వీళ్ళకి వణుకే.
ఒక్కో సారి చిన్నపటినించి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన భయాలు కాక, కొత్త భయాలు పుడతాయి మనసులో.
ఇంతకీ అసలు సంగతేంటంటే మొన్నీమధ్య ఇంటికి వస్తోంటే దారిలో ఒక జడలు విరబోసుకున్నట్టు ఉన్న దెయ్యం చెట్టొకటి కనిపించింది.....అప్పటికే కాస్త చీకటి పడింది, ఇదివరకెప్పుడూ ఆ చెట్టునక్కడ చూసినట్టు గుర్తులేదు, అటు వైపుగా పెద్దగా వచ్చింది కూడా లేదనుకోండి! సడన్ గా భయం పుట్టింది నాకు.....కార్ స్పీడ్ పెంచేసి ఆ ఏరియా నుండి బయటపడ్డా. ఇంటికి వచ్చాక కూడా అదే గుర్తుకు వస్తోంది...

నా చిన్నప్పుడు ఊరికి వెళ్తే అక్కడ పిల్లలు చింత చెట్టు కింద దెయ్యాలుంటాయని చెప్పేవారు....వూళ్ళో వీధులన్నీ దర్జాగా తిరిగేసి, చింత చెట్టుకిందకి రాగానీ....మనసులో పీకేది...ఏమో నిజంగానే దెయ్యాలున్నయేమో !!....పరుగే పరుగు అక్కణ్ణించి.

ఇంతకీ దెయ్యం అంటే గుర్తొచ్చింది,....నా మొదటి హార్రర్ సినిమా రాంగోపాల్ వర్మ "రాత్రి". అందులో రేవతి కళ్లు నన్ను ఎన్ని రోజులు నిద్రపోనీలేదో....నాకే తెలుసు....ఒక నెల రోజుల వరకు ఒక్కదాన్నే బాత్రూంకి వెళ్ళాలన్నా భయం!....మంచం కిందకి తొంగి చూడాలన్నా భయం!....పడుకునేటప్పుడు లైట్ ఆర్పేయాలన్నా భయం!

సరే, మళ్ళీ నా చెట్టు గోలకి వద్దాం. ఇలా భయాల లిస్టు పెంచుకుంటూ పోతే లాభం లేదనేసుకుని ..."దాన్ని ఫోటో తీసి నా బ్లాగు లో పెడదాం...రొజూ చూస్తూంటే భయం వడులుతుందని" డిసైడ్ అయిపోయా.


మర్నాడు hospital నించి ఇంటికి వచ్చేటప్పుడు, కాస్త వెలుతురు ఉండగానే బయలుదేరా....మళ్ళీ చీకటి పడితే మనసు మార్చేసుకుంటానేమో అని త్వరగా వెళ్ళి దాన్ని నా కెమేరాలో బంధించేసాను. హమ్మయ్య! ఇక నిశ్చింతగా పడుకోవచ్చు అనుకుంటూ ఇంటికి చేరాను. పార్కింగ్ లో నడుస్తూండగా అందమైన sunset కనిపించింది. కార్ల మధ్యన, ఇంక చిగురురాని చెట్ల మధ్యన....ఆరంజ్, యెల్లో, బ్లూ, పర్పుల్ కాంబినేషన్స్ అదుర్స్!

Have a good night!



2 కామెంట్‌లు:

  1. ప్రతిభ గారు మీ బ్లొగ్ రెగులర్ గ తిరగవెస్తున్న , చక్కటి తెలుగు మన చందమమ, ఈనాడు ఆదివారం పుస్తకాలని మరిపిస్తున్నయి.
    ధన్యవాదలు.
    పెల్లి ముచట్లు, ధయ్యం చెట్టు టపిక్స్ చదివినప్పుదు నా అనుభవాలని నెమర వెసుకున్న
    ~~~
    ఆచ్యుత రాముడు

    రిప్లయితొలగించండి
  2. థాంక్యూ అచ్యుత్ గారు, మీకు నా పోస్ట్స్ నచ్చినందుకు సంతోషం.

    రిప్లయితొలగించండి

Related Posts Widget for Blogs by LinkWithin
Powered By Blogger