24, ఏప్రిల్ 2009, శుక్రవారం

అలసిన వేళ.....!

After a long day! నిన్న పొద్దుటే ఇంట్లోంచి బయలుదేరానా... రాత్రి హాస్పిటల్ లో కాల్ డ్యూటీ! అది ముగించుకుని ఇవాళ పొద్దున్న ఇంటికి చేరటం!
రాగానే చేతిలో ఉన్నహ్యాండ్ బ్యాగు, తాళాలు అన్నీకింద పడేసి, సోఫా లో కూలబడ్డా! కాస్త నీరసం....బోల్డంత బద్దకం! నా చుట్టూ పరుచుకుంటున్న ఎండలో రూమ్ ని ఓసారి అలా...zoom చేయగానే....కళ్లు సోఫా పక్కన ఉన్నవాటి మీద పడ్డాయి. మొన్నీమధ్య ఆర్డర్ చేసిన హార్డ్ డిస్క్....నన్ను ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని అలిగి కూర్చున్నట్లుంది!
దాని పక్కనే ఉన్న ఎర్రని బ్యాగు వారం క్రితం సెమినార్ కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నది ...."ఈ ఇంట్లో నా స్థానం ఏమిటా?...ఉండనిస్తారా బయటపడేస్తారా " అన్నట్టు మూల నక్కింది.
దానవతల ఉన్న ఆరంజ్ బాక్స్ లో jenga - అనే గేమ్! క్రితం ఆదివారం ఫ్రెండ్స్ అందరం letchworth park కి వెళ్ళినప్పుడు, తీసుకెళ్దామని బయటపెట్టి మర్చిపోయి వెళ్ళిన సంగతి గుర్తు చేస్తూ!
నేనూ, నా చుట్టూ వున్న సామానూ .... ఒంటరిగా వున్నప్పుడు ఏమి తోచనప్పుడు వాటి తోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అలా అని నాకు ఏ schizophreniaనో(మానసిక వ్యాధి) అంటకట్టకండి, మీరు మరీను!ఫోటో అయితే తీసా గానీ, కాస్త సర్దుదామంటే, అబ్బే...వేలు కూడా కదలట్లేదు!...లాభం లేదు...ఈ నిసత్తువ లోంచి బయటపడాలంటే ...మాంచి నిద్ర వెయ్యాల్సిందే! మళ్ళీ లేచాక తీరిగ్గా వచ్చి కొత్త పోస్ట్ వేస్తానులే!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Widget for Blogs by LinkWithin
Powered By Blogger