30, మే 2009, శనివారం

ప్రకృతి ఒడిలో - లెచ్చ్వర్త్ పార్క్

ఎటు చూసినా బిల్డింగ్స్, రోడ్లు....పరుగుల ప్రయాణం లో కారు ఎక్కడం దిగటం.......వీటినించి దూరంగా కాస్త సహజ వాతావరణం లో రిలాక్స్ అవ్వాలని ఉబలాటం! అందుకే ఫ్రెండ్స్ అందరం ఇక్కడికి గంట దూరం లో ఉన్నా Letchworth నేషనల్ పార్క్ కి బయలుదేరాం. అక్కడ చెట్ల మధ్యన భోజనం, అంచెలంచెలు గా మూడు వాటర్ ఫాల్స్, కొండని తొలుచుకుంటూ ప్రవాహం.....దాని పక్కన మా నడక.....పలుచని ఎండా....ఎంత హాయిగా అనిపించిందో!
ఏసీల్లో కూర్చుని మగ్గిన గాలినే మళ్ళీ పీల్చి, air freshners తో తడిసిన గాలి కి అలవాటైన నా ముక్కు పుటాలకి నీటి చెమ్మ తో తడిసి,....గడ్డి పూల వాసన, అడవి చెట్ల కమ్మదనం మోసుకొచ్చే గాలి కొత్త గా వుండింది.





ఆ నీటి పాయ అంతోటి కొండని కింద వరకు తొలుచుకుంటూ వెళ్ళటానికి ఎంత కాలం పట్టిందో. అక్కడున్న మూడు జలపాతాలలో అప్పర్ ఫాల్స్
అన్నిటికన్నా బావుంది.
రాళ్ళ మీదుగా దిగి, నది అంచున నడుచుకుంటూ ఫాల్స్ దాకా వెళ్ళాము. అంతా పలకల పలకల రాయి, నీటి ఒరవడికి కొండ ఎలా కరిగిపోయిందో అది చూసాక అర్థమయ్యింది.

కొత్తగా మొలిచిన గడ్డి పూలు ఎంత అందంగా వున్నాయో, ...... ఎండిపోయి రాలిన pine cone కూడా అంత అందంగానే అనిపించింది.
మొత్తానికి Nature's cradle లో కాసేపు అలా వూయలూగి, పర్యావరణ-పర్యాటక శాఖ నించి రోడ్లు భవనాల శాఖకి బదిలీ అయిపోయాము.

1 కామెంట్‌:

  1. jagan mohan rao.k6/6/09 19:28

    dear,pratibha.
    just saw your blog.enjoyed verymuch,you are a good writer.tell me how you are typing matter in telugu.i also wish to start a blog of my family.keep me informed about new additions in your blog.

    రిప్లయితొలగించండి

Related Posts Widget for Blogs by LinkWithin
Powered By Blogger